Friday, 8 September 2017

ఈ నియమాలు పాటిస్తే మీరు ఐశ్వర్యవంతులు అవ్వడం ఖాయం....



ఈ నియమాలు పాటిస్తే  మీరు ఐశ్వర్యవంతులు అవ్వడం ఖాయం....
మీకున్న దరిద్రం దూరమవ్వాలా...మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోవాలా...మీ అప్పులన్నీ తీరిపోవాలా...మీ యింట్లో ఐశ్వర్యం పెరగాలా...మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలా...అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవ్వాలా...అయితే విధంగా చెయ్యండి.యిలాచేస్తే మీ యింట్లో ఉన్న దరిద్ర దేవత బయటకువెళ్లిపోవడం..లక్స్మీదేవి మీ యింట్లో తిష్టవేసుకొని కూర్చోవడం ఒకేసారి జరుగుతుంది.యింతకీ ఏంచెయ్యాలి...అనుకుంటున్నారా...అయితే వీడియో చూడండి....
మీ యింటి ముఖద్వారం లేదా ప్రధాన ద్వారాన్ని సింహద్వారం అనికూడా అంటారు. సింహద్వారం  ముందు,కొద్దిగా నీటిని చల్లి,ముగ్గువెయ్యాలి.తర్వాత  సింహద్వారంయొక్క గడపని శుభ్రంగా కడిగి, చక్కగా పసుపురాసి,కుంకుమ  బొట్టుపెట్టాలి.సింహద్వారంపైన మామిడాకుల తోనూపూలమాలలతోనూ తోరణాలు కట్టాలి.దీనితోపాటు వెనుక గుమ్మానికి కూడా అలాగే చెయ్యాలి.కాని చాలామంది ఇంటివెనుక గుమ్మాన్ని పట్టించుకోరు.యిలా  పట్టించుకోక పోవడం వల్ల, శుభ్రంగా ఉండదు.ఎప్పుడైతే శుభ్రంగా ఉండదో, వెనుకగుమ్మం నుంచి దరిద్రదేవత యింటిలోనికి వచ్చి కూర్చుంటుంది.అలా జరక్కుండా ఉండాలంటే, సింహద్వారానికి ఎలా అయితే చేశారో వెనుక గుమ్మానికికూడా అలాగే చెయ్యాలి. యిలా చెయ్యదంవల్ల వెనుకనుంచి ఏడమకాలుపెట్టి,రావడానికి సిద్ధపడే దరిద్రదేవతని పెరటి గుమ్మం అనగా వెనుకగుమ్మం అడ్డుకొని,వెనక్కి పంపించేస్తుంది.అందుకే పెరటి గుమ్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.వీధిగుమ్మంలోవేసినట్టే పెరటిగుమ్మంలోకూడా అంతే ముగ్గువెయ్యాలి. మీ పూజగదిలో మీ గ్రామదేవత ఫోటోని తప్పనిసరిగా పెట్టుకోవాలి.మీ కులదేవత యొక్క యంత్రాన్ని పెట్టుకోవాలి.యిది కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి.మీ కులదేవత యెవరో మీకు తెలియకపోతే మీ పెద్దవారిని అడిగితెలుసుకోండి.. ఫోటో పెట్టుకుంటే ఆదేవత మిమ్మల్ని కంటికిరెప్పలా కాపాడి మీకు ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది.మీ యిలవెల్పు అనగా మీ యింటిదేవుడు లేదా దేవత యెవరైతే వారి ఫోటోకూడా పూజగదిలో ఉంచుకోవాలి.వంటగదిని లక్ష్మీస్థానంగా చెబుతారు. అన్నపూర్ణాదేవియే లక్ష్మీదేవిగా వంటగదిలో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటుంది.కాబట్టి వాంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. వంటగదిని చాలామందిని శుభ్రంగా ఉంచుకోరు.దానివల్ల దరిద్రం దాపురిస్తుంది. కాబట్టి వంటగదిని శుభ్రంచేసే విషయంలో అజాగ్రత్త వహించకూడదు.మసిగుడ్డని శుభ్రంగా ఉంచుకుంటే మంచిది. బొద్దింకని దరిద్రదేవతకి వాహనంగా చెబుతారు.కాబట్టి బొద్దింకలు లేకూండా చూసుకోవాలి.యిలా జాగ్రత్తపడితే ఐశ్వర్యవంతులు అవుతారు. ఆనవాయితీ ఉన్నాలేకపోయినా తప్పనిసరిగా మీ యింత్లో తులసిమొక్క ఉండాలి. తులసిమొక్క ముందు ప్రతిరోజూ కుబేరముగ్గువెయ్యాలి. ఇంకా దేవుదిగదిలోకూడా ప్రతిరోజూ కుబేరముగ్గు వెయ్యాలి.దీనితొపాటు ప్రతిరోజూ దేవుదికి దీపారాధనచెయ్యాలి.ఇవన్నీ ఎవరైతే చెస్తారోవారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.వారి యిల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. వారుపట్టిందల్లా  బంగారం అవుతుంది.కాబట్టి మీరుకూడా యివన్నీ పాటించి ఐశ్వర్యవంతులుకండి.   
watch

ఈ పండుతో షుగర్ కి చెక్ పెట్టొచ్చు....

ఈ పండుతో షుగర్ కి చెక్ పెట్టొచ్చు....

డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు,తమకు డయాబెటిస్ వల్ల ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయోనని చింతిస్తూ ఉంటారు.ఒక పక్క మానసిక వేదనని అనుభవిస్తూ, మరోపక్క మందులు వాడుతూ ఉంటారు. ఎన్నిమందులు వాడినా ఉపయోగం లేకపోవడంతో బాధపడుతూ ఒత్తిడికి గురి అవుతారు.అలాంటి వారు ఇప్పుడు చింతించాల్సినపనిలేదు. ఇంగ్లీష్ మందులతో పనిలేకుండా, సహజసిద్ధమైన ఆయుర్వేద పద్ధతుల్ని అవలంభించి,డయాబెటిస్ ని తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మధుమేహవ్యాధితో బాధపడ్తున్నవారు.ఒకే ఒక్క పనసతొనతో మధుమేహాని తగ్గించుకోవచ్చునని వారు చెబుతున్నారు. ఇప్పుడు పనసపండుతొన మధుమేహాన్ని ఎలా తగ్గిస్తుందో, దీనిలోని ఔషథగుణాలేమిటో తెలుసుకుందాం.....
చిన్నాపెద్దా అనితేడాలేకుండా అందరూ యిష్టంగా తినే పండ్లలో పనసపండు తొన ఒకటి. పనసపండు తొనలో విటమిన్ ,విటమిన్ సీ, థియామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం,ఐరన్, మ్యాంగనీస్ మరియు మెగ్నీషియం తోపాటు,నూట్రియంట్స్ ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారికి పనసపండు మంచి ఆహారంగా డాక్టర్లు చెబుతున్నారు.ఇది తింటే శరీరానికి ఇన్సులిన్ ని అందిస్తుంది. కాయల్లోకెల్లా పనసకాయే పెద్దదిగా చెప్పవచ్చు. పనసపండు లో చాలా  పనసతొనలు ఉంటాయి. ఇవి తినడంవల్ల,మన శరీరానికి పొటాషియం, క్యాల్షియం, ప్రొటీన్లు మరియు ఐరన్ అందుతుంది, పనసతోనలో విటమిన్లు,మినరల్స్ మరియు ఐరన్ ఎక్కువగా ఉంటాయి.కనుక ఇవి డయాబెటిస్ ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. పనస తొనని తింటే శరీరానికి ఇన్సులిన్ ని అందించినట్టే.దీనిలో డైటరీ ఫైబర్స్ ఎక్కువగా ఉండడంవల్ల, పనసతొనల్ని ఒక ప్లేటు భోజనం పరిమాణంలో తింటే మంచిఫలితాలు ఉంటాయి. ఇవి తింటే కదుపు నిండినట్టే అవుతుంది కాబట్టిఆకలి ఎక్కువగావేస్తున్న డయాబేటిక్ పేషంట్లు పనసతొనల్ని నిరభ్యంతరంగా తినవచ్చు. టైప్ 2 డయాబెటిస్ నీ,ఒబేసిటీని తగ్గించడంలో పసనతోన సమర్థవంతంగా  పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలద్వారా తెలుస్తోంది. పసపండు తోన ఒక్క డయాబెటిస్ ని తగ్గించడంలోనే కాదు,ఇతర వ్యాధుల్ని తగ్గించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.ఇది బోన్స్ ని ఆరోగ్యంగా ఉంచి,గట్టిపరుస్తుంది. పనసపండు పలురకాల క్యాన్సర్లని తగ్గిచడంలో సహాయం చేస్తుంది.దీనిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థని మెరుగుపరచడంలో సహకరించగా,పొటాషియం హైబీపీని తగ్గించి,హార్ట్ ప్రాంబ్లంస్ ని తగ్గిస్తుంది.విటమిన్ కంటిని పరిరక్షిస్తుంది.రేచీకటిని అనీమియాని అరికట్టి,బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. పనసపండులో ఉండే సక్రొజ్,ఫ్రక్టోజ్ లు శరీరానికి శక్తినిస్తాయి.ఇంకా దీనిలో యాంటీ అల్సర్ ఫ్రాఫర్టీస్  ఉంటాయి.ఇవి గుండెలోవచ్చే మంటని తగ్గించడంతోపాటు శ్వాససంబంధవ్యాధుల్నికూడా అరికడతాయి.కాబట్టి ప్రతిరోజూ పనసతొనల్ని తినండి. డయాబెటిస్ తోపాటు,ఇతరవ్యాధుల్నీ తగ్గించుకోండి....


పరగడుపున వెల్లుల్లి మరియు తెనెని కలిపి తీసుకుంటే ఏంజరుగుతుంది...

పరగడుపున వెల్లుల్లి మరియు తెనెని కలిపి తీసుకుంటే ఏంజరుగుతుంది...






















పరగడుపున వెల్లుల్లి మరియు తెనెని కలిపి తీసుకుంటే ఏంజరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం... వెల్లుల్లి మరియు తేనెకాంబినేషన్ చాలా శక్తివంతమైనదిగా చెప్పవచ్చును.వెల్లుల్లి హార్ట్ డిసీజెస్ రాకుండా కాపాడుతుంది.కరోనరీ హార్ట్ డిసీజ్, హార్ట్ ఎటాక్ లని తగ్గిస్తుంది.తేనె బరువుని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచెస్తుంది.జుట్టుని ఒత్తుగా పెంచుతుంది.బ్లడ్ ప్రెషర్ నీ,కొలెస్ట్రాల్ నీ తగ్గిస్తుంది.రోగనిరోధక శక్తిని పెంచుతుంది.డయాబెటిస్ తగ్గిస్తుంది.ఆస్టియో ఆర్థరైటిస్ ని మెరుగుపరుస్తుంది.ఇంకా ఫ్లూ జ్వరాన్ని తగ్గించడంతోపాటు, జలుబు,డయేరియా,ఫంగల్ ఇన్ ఫెక్షన్స్ ని తగ్గిస్తుంది. ఇప్పుడు వెల్లుల్లివల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం...
వెల్లుల్లి శరీరంలోని టాక్సిన్స్ ని తొలగిస్తుంది.ఇంకా మంచి ఫలితాలు రావాలంటే వెల్లుల్లిని పచ్చిగానే తినాలి.వైద్య పరంగా వెల్లుల్లి అనేక రుగ్మతలకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటుని నివారించడంలో వెల్లుల్లి ఎంతగానో ఉప యోగపడుతుంది. ఇందులో లభ్యమయ్యే హైడ్రోజన్సల్ఫేట్‌, నైట్రిక్ యాసిడ్‌, రక్తనాళాల్ని శుభ్రపరచడానికి  ఎంతగానో దోహదపడతాయి. వెల్లుల్లి తీసుకోడం వలన జీర్ణశక్తి వృద్ధిచెంది మంచి ఆకలి పుడుతుంది. వెల్లుల్లి అల్లంతో కలిపి తింటూవుంటే ఎటువంటి ఎలర్జీలు దరిచేరవు. ప్రతి నిత్యం పరగడుపున 2, 3 వెల్లుల్లి రెబ్బలు తినడం వలన ఉదరసంబంధ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. వెల్లుల్లిలో శృంగారాన్ని పెంపొందించి వీర్యవృద్ధిని కలిగించే శక్తి ఉందని కొన్ని అధ్యనాలద్వారా వెల్లడయింది. అంతే కాక శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా ఇందులో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. లూయీ పాశ్చర్‌ 1858లో, వెల్లుల్లిలో బేక్టీరియాని నిర్మూలించగల శక్తి, గాంగ్రీన్వ్యాధిని నిర్మూలించే శక్తీ ఉన్నాయని కనుగొన్నాడు.   వెల్లుల్లిలో థయామిన్లోపాన్ని తగ్గించి అభివృద్ధిచేసే గుణం కూడా పుష్కలంగా ఉంది. వెల్లుల్లిలో విటమిన్‌ 'సి' అత్యంత అధికంగా ఉండడం వల్ల నోటివ్యాధులకి దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని 1924లోనే కనుగొనడం జరిగింది. అంతేకాక ఉబ్బసం, జ్వరం, కడుపులో నులిపురుగుల నివారణకి, లివర్అనగా కాలేయవ్యాధులకీ చక్కటి ఔషధంగా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. అలాగే గుండెజబ్బులకి దీన్నిమించిన ఔషధం లేదంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరగడానికి వెల్లుల్లి దోహదపడుతుంది. లుకోడెర్మా, కుష్ఠు వ్యాధులకి కూడా ఇది అవెూఘంగా పనిచేస్తుంది.క్షయ వ్యాధికి, న్యూవెూనియాకి వెల్లుల్లికి మించినది లేదు. 3 వెల్లుల్లి పాయలను పాలతో మరగబెట్టి పడుకునే ముందు రాత్రిపూట సేవిస్తే ఉబ్బసం తగ్గిపోతుంది. రక్తపోటుని నియంత్రించడంలోను, టెన్షన్తగ్గించడంలోను, జీర్ణకోశ వ్యాధుల నివారణకి, రక్తకణాల్లో కొలస్ట్రాల్శాతాన్ని అదుపుచేయడానికి వెల్లుల్లిని మించిన ఔషధం లేదు. వారానికి 5 వెల్లుల్లిపాయలు పచ్చివి తిన్నా, పండినవి తిన్నా కేన్సర్వ్యాధిని 40 నుంచి 50 శాతం వరకూ  తగ్గించుకోవచ్చు.   .ఒక విధంగా చెప్పాలంటే వెల్లుల్లిని సర్వరోగనివారిణి అనిచెప్పవచ్చు.   యిన్ని రకాల ఔషథగుణాలున్న వెల్లుల్లిని,తెనెని కలిపితీసుకోండి...అనేక అనారోగ్యాల్ని తగ్గించుకోండి...watch this...