Friday, 8 September 2017

ఈ నియమాలు పాటిస్తే మీరు ఐశ్వర్యవంతులు అవ్వడం ఖాయం....



ఈ నియమాలు పాటిస్తే  మీరు ఐశ్వర్యవంతులు అవ్వడం ఖాయం....
మీకున్న దరిద్రం దూరమవ్వాలా...మీ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోవాలా...మీ అప్పులన్నీ తీరిపోవాలా...మీ యింట్లో ఐశ్వర్యం పెరగాలా...మీరు పట్టిందల్లా బంగారం అవ్వాలా...అష్ట ఐశ్వర్యాలు మీ సొంతమవ్వాలా...అయితే విధంగా చెయ్యండి.యిలాచేస్తే మీ యింట్లో ఉన్న దరిద్ర దేవత బయటకువెళ్లిపోవడం..లక్స్మీదేవి మీ యింట్లో తిష్టవేసుకొని కూర్చోవడం ఒకేసారి జరుగుతుంది.యింతకీ ఏంచెయ్యాలి...అనుకుంటున్నారా...అయితే వీడియో చూడండి....
మీ యింటి ముఖద్వారం లేదా ప్రధాన ద్వారాన్ని సింహద్వారం అనికూడా అంటారు. సింహద్వారం  ముందు,కొద్దిగా నీటిని చల్లి,ముగ్గువెయ్యాలి.తర్వాత  సింహద్వారంయొక్క గడపని శుభ్రంగా కడిగి, చక్కగా పసుపురాసి,కుంకుమ  బొట్టుపెట్టాలి.సింహద్వారంపైన మామిడాకుల తోనూపూలమాలలతోనూ తోరణాలు కట్టాలి.దీనితోపాటు వెనుక గుమ్మానికి కూడా అలాగే చెయ్యాలి.కాని చాలామంది ఇంటివెనుక గుమ్మాన్ని పట్టించుకోరు.యిలా  పట్టించుకోక పోవడం వల్ల, శుభ్రంగా ఉండదు.ఎప్పుడైతే శుభ్రంగా ఉండదో, వెనుకగుమ్మం నుంచి దరిద్రదేవత యింటిలోనికి వచ్చి కూర్చుంటుంది.అలా జరక్కుండా ఉండాలంటే, సింహద్వారానికి ఎలా అయితే చేశారో వెనుక గుమ్మానికికూడా అలాగే చెయ్యాలి. యిలా చెయ్యదంవల్ల వెనుకనుంచి ఏడమకాలుపెట్టి,రావడానికి సిద్ధపడే దరిద్రదేవతని పెరటి గుమ్మం అనగా వెనుకగుమ్మం అడ్డుకొని,వెనక్కి పంపించేస్తుంది.అందుకే పెరటి గుమ్మాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.వీధిగుమ్మంలోవేసినట్టే పెరటిగుమ్మంలోకూడా అంతే ముగ్గువెయ్యాలి. మీ పూజగదిలో మీ గ్రామదేవత ఫోటోని తప్పనిసరిగా పెట్టుకోవాలి.మీ కులదేవత యొక్క యంత్రాన్ని పెట్టుకోవాలి.యిది కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలి.మీ కులదేవత యెవరో మీకు తెలియకపోతే మీ పెద్దవారిని అడిగితెలుసుకోండి.. ఫోటో పెట్టుకుంటే ఆదేవత మిమ్మల్ని కంటికిరెప్పలా కాపాడి మీకు ఐశ్వర్యాన్ని కలగజేస్తుంది.మీ యిలవెల్పు అనగా మీ యింటిదేవుడు లేదా దేవత యెవరైతే వారి ఫోటోకూడా పూజగదిలో ఉంచుకోవాలి.వంటగదిని లక్ష్మీస్థానంగా చెబుతారు. అన్నపూర్ణాదేవియే లక్ష్మీదేవిగా వంటగదిలో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటుంది.కాబట్టి వాంటగదిని శుభ్రంగా ఉంచుకుంటే లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. వంటగదిని చాలామందిని శుభ్రంగా ఉంచుకోరు.దానివల్ల దరిద్రం దాపురిస్తుంది. కాబట్టి వంటగదిని శుభ్రంచేసే విషయంలో అజాగ్రత్త వహించకూడదు.మసిగుడ్డని శుభ్రంగా ఉంచుకుంటే మంచిది. బొద్దింకని దరిద్రదేవతకి వాహనంగా చెబుతారు.కాబట్టి బొద్దింకలు లేకూండా చూసుకోవాలి.యిలా జాగ్రత్తపడితే ఐశ్వర్యవంతులు అవుతారు. ఆనవాయితీ ఉన్నాలేకపోయినా తప్పనిసరిగా మీ యింత్లో తులసిమొక్క ఉండాలి. తులసిమొక్క ముందు ప్రతిరోజూ కుబేరముగ్గువెయ్యాలి. ఇంకా దేవుదిగదిలోకూడా ప్రతిరోజూ కుబేరముగ్గు వెయ్యాలి.దీనితొపాటు ప్రతిరోజూ దేవుదికి దీపారాధనచెయ్యాలి.ఇవన్నీ ఎవరైతే చెస్తారోవారిని లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.వారి యిల్లు అష్ట ఐశ్వర్యాలతో నిండిపోతుంది. వారుపట్టిందల్లా  బంగారం అవుతుంది.కాబట్టి మీరుకూడా యివన్నీ పాటించి ఐశ్వర్యవంతులుకండి.   
watch

No comments:

Post a Comment