Friday 8 September 2017

ఈ పండుతో షుగర్ కి చెక్ పెట్టొచ్చు....

ఈ పండుతో షుగర్ కి చెక్ పెట్టొచ్చు....

డయాబెటిస్ వ్యాధి ఉన్నవారు,తమకు డయాబెటిస్ వల్ల ఎలాంటి అనర్థాలు సంభవిస్తాయోనని చింతిస్తూ ఉంటారు.ఒక పక్క మానసిక వేదనని అనుభవిస్తూ, మరోపక్క మందులు వాడుతూ ఉంటారు. ఎన్నిమందులు వాడినా ఉపయోగం లేకపోవడంతో బాధపడుతూ ఒత్తిడికి గురి అవుతారు.అలాంటి వారు ఇప్పుడు చింతించాల్సినపనిలేదు. ఇంగ్లీష్ మందులతో పనిలేకుండా, సహజసిద్ధమైన ఆయుర్వేద పద్ధతుల్ని అవలంభించి,డయాబెటిస్ ని తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.మధుమేహవ్యాధితో బాధపడ్తున్నవారు.ఒకే ఒక్క పనసతొనతో మధుమేహాని తగ్గించుకోవచ్చునని వారు చెబుతున్నారు. ఇప్పుడు పనసపండుతొన మధుమేహాన్ని ఎలా తగ్గిస్తుందో, దీనిలోని ఔషథగుణాలేమిటో తెలుసుకుందాం.....
చిన్నాపెద్దా అనితేడాలేకుండా అందరూ యిష్టంగా తినే పండ్లలో పనసపండు తొన ఒకటి. పనసపండు తొనలో విటమిన్ ,విటమిన్ సీ, థియామిన్, రిబోఫ్లేవిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం,ఐరన్, మ్యాంగనీస్ మరియు మెగ్నీషియం తోపాటు,నూట్రియంట్స్ ఉన్నాయి. డయాబెటిస్ ఉన్నవారికి పనసపండు మంచి ఆహారంగా డాక్టర్లు చెబుతున్నారు.ఇది తింటే శరీరానికి ఇన్సులిన్ ని అందిస్తుంది. కాయల్లోకెల్లా పనసకాయే పెద్దదిగా చెప్పవచ్చు. పనసపండు లో చాలా  పనసతొనలు ఉంటాయి. ఇవి తినడంవల్ల,మన శరీరానికి పొటాషియం, క్యాల్షియం, ప్రొటీన్లు మరియు ఐరన్ అందుతుంది, పనసతోనలో విటమిన్లు,మినరల్స్ మరియు ఐరన్ ఎక్కువగా ఉంటాయి.కనుక ఇవి డయాబెటిస్ ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. పనస తొనని తింటే శరీరానికి ఇన్సులిన్ ని అందించినట్టే.దీనిలో డైటరీ ఫైబర్స్ ఎక్కువగా ఉండడంవల్ల, పనసతొనల్ని ఒక ప్లేటు భోజనం పరిమాణంలో తింటే మంచిఫలితాలు ఉంటాయి. ఇవి తింటే కదుపు నిండినట్టే అవుతుంది కాబట్టిఆకలి ఎక్కువగావేస్తున్న డయాబేటిక్ పేషంట్లు పనసతొనల్ని నిరభ్యంతరంగా తినవచ్చు. టైప్ 2 డయాబెటిస్ నీ,ఒబేసిటీని తగ్గించడంలో పసనతోన సమర్థవంతంగా  పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలద్వారా తెలుస్తోంది. పసపండు తోన ఒక్క డయాబెటిస్ ని తగ్గించడంలోనే కాదు,ఇతర వ్యాధుల్ని తగ్గించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.ఇది బోన్స్ ని ఆరోగ్యంగా ఉంచి,గట్టిపరుస్తుంది. పనసపండు పలురకాల క్యాన్సర్లని తగ్గిచడంలో సహాయం చేస్తుంది.దీనిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థని మెరుగుపరచడంలో సహకరించగా,పొటాషియం హైబీపీని తగ్గించి,హార్ట్ ప్రాంబ్లంస్ ని తగ్గిస్తుంది.విటమిన్ కంటిని పరిరక్షిస్తుంది.రేచీకటిని అనీమియాని అరికట్టి,బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుంది. పనసపండులో ఉండే సక్రొజ్,ఫ్రక్టోజ్ లు శరీరానికి శక్తినిస్తాయి.ఇంకా దీనిలో యాంటీ అల్సర్ ఫ్రాఫర్టీస్  ఉంటాయి.ఇవి గుండెలోవచ్చే మంటని తగ్గించడంతోపాటు శ్వాససంబంధవ్యాధుల్నికూడా అరికడతాయి.కాబట్టి ప్రతిరోజూ పనసతొనల్ని తినండి. డయాబెటిస్ తోపాటు,ఇతరవ్యాధుల్నీ తగ్గించుకోండి....


No comments:

Post a Comment