Thursday, 7 September 2017

హెయిర్ ఫాల్ తగ్గించుకొనే మార్గాలు...

హెయిర్ ఫాల్ తగ్గించుకొనే మార్గాలు...
ఈరోజుల్లో ఆడామగా అనే తేడాలేకుండా,అందరూ ఉద్యోగాలకి వెళ్తున్నారు. అలా ఆఫీసులకి వెళ్లాలంటే ఎండ,వాన,చలి అని లెక్కచెయ్యకుండా, బైక్స్,ఆటోలు,బస్సులు మరియు కార్లలో ప్రయాణించాలి. అలా ప్రయాణం చేసేటప్పుడు,గాలిలోని దుమ్ము,ధూళి వచ్చి జుట్టులో చేరిపోతుంటాయి. అలా చేరిన దుమ్ము ధూళివల్ల, జుట్టుకుదుళ్లు అనారోగ్యానికి గురై జుట్టురాలిపోతూ  ఉంటుంది. కొంతమందికి పని ఒత్తిడివల్ల ఒత్తిడికి గురై, జుట్టు రాలిపోతూ ఉంటుంది. రసాయనాలతో కూడిన షాంపూలు వాడడంవల్ల, కొన్ని రకాల హెయిర్ ఆయిల్స్ వల్ల జుట్టురాలిపోవడం తోపాటు,చుడ్రు సమస్యలు తలెత్తుతాయి. అలాంటివారు రెమెడీస్ ని  ఫాలో అయితే హెయిర్ ఫాల్ సమస్యనుంచి ఉపశమనం పొందవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. రసాయనాలతో కూడిన షాంపూలతో తల స్నానంచెయ్యకుండా, సహజసిద్ధమైన ఔషథగుణాలున్న కుంకుడు కాయని గానీ,శీకాకాయని గాని ఉపయోగించి తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా ఎదుగుతుందనీ,ఇలా చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోవడంతోపాటుఇక్కడ చెప్పిన చిట్కాల్ని పాటిస్తే హెయిర్ ఫాల్ సమస్యకి చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు.
మొదటి రెమెడీ -బాదం నూనె: ముందుగా ఒక బౌల్ తీసుకొని,దానిలో కొద్దిగా బాదం నూనెని పోసి,కుడిచేతి వేళ్లని ముంచి,జుట్టుకుదుళ్లకి రాసి,కొన్ని నిమిషాలపాటు బాగా మర్థనా చెయ్యాలి.ఇలా చేస్తే బాదంనూనెలో ఉండే పోషకాలు జుట్టుకుదుళ్లని ఆరోగ్యంగా ఉంచి,జుట్టురాలకుండా కాపాడతాయి.కాబట్టి రెగ్యులర్ గా ఇలా మర్థనా చేస్తుండాలి.


No comments:

Post a Comment